: రేపు ఏపీకి మరో రూ.1600 కోట్లు.. ఇందులో రూ.500 కోట్లు రూ.500 నోట్లే


నోట్ల రద్దుతో ఇబ్బందులు పడుతున్న ఏపీ ప్రజలకు ముఖ్యమంత్రి మరో శుభవార్త చెప్పారు. రిజర్వు బ్యాంకు నుంచి బుధవారం రాష్ట్రానికి మరో రూ.1600 కోట్లు రానున్నట్టు చంద్రబాబు వెల్లడించారు. ఈ మొత్తంలో రూ.500 కోట్ల విలువ చేసే రూ. 500 నోట్లు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ దెబ్బతో చిల్లర కష్టాలకు తెరపడినట్టేనని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే రాష్ట్రానికి అందిన రూ.2,500 కోట్లలో రూ.500 కోట్ల విలువైన రూ.500 నోట్లు ఉన్న విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. మొత్తం రూ. వెయ్యి కోట్ల మేర రూ.500 నోట్లు అందుబాటులో ఉండడంతో చిల్లర సమస్యకు తెరపడినట్టేనని సీఎం వివరించారు. దేశ పురోగతి కోసం ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయానికి ప్రతి ఒక్కరు అండగా నిలవాలని కోరారు. సోమవారం బ్యాంకర్లు, కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ వివరాలు వెల్లడించారు.

  • Loading...

More Telugu News