: ప్రాణాలు తీసిన ఫొటో సరదా.. శ్రీశైలం ప్రాజెక్టు నీటిలో మునిగి జెన్‌కో ఏఈ దంపతుల మృతి
ఫొటో తీసుకోవాలన్న సరదాకు దంపతుల నిండు ప్రాణం బలైంది. నాగర్‌కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలంలోని శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వద్ద ఈ విషాదం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్‌లోని మియాపూర్‌కు చెందిన క్రాంతికుమార్(33) జెన్‌కోలో ఏఈగా పనిచేస్తున్నారు. ఆదివారం సెలవు కావడంతో భార్య సంయుక్త(28)తో కలిసి బైక్‌పై శ్రీశైలం రిజర్వాయర్ ఇన్‌టేక్ టర్నల్ గేట్ సమీపంలోకి వెళ్లారు. ఈ క్రమంలో అక్కడి అందాలను చూసిన సంయుక్త ఫొటో దిగేందుకు ప్రయత్నిస్తుండగా ప్రమాదవశాత్తు బ్యాక్ వాటర్‌లో పడింది. వెంటనే అప్రమత్తమైన భర్త క్రాంతికుమార్ ఆమెను రక్షించేందుకు నీటిలో దిగడంతో, ఆయన కూడా మునిగిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.