: కవిత బతుకమ్మ ఫొటోతో పోస్టల్ స్టాంప్.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, బ్రిటన్‌లలో విడుదల
తెలంగాణ బతుకమ్మకు ఖండాంతర ఖ్యాతి లభించింది. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కుమార్తె, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బతుకమ్మను ఎత్తుకున్న ఫొటోతో బ్రిటన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలో ఓ పోస్టల్ స్టాంప్ విడుదలైంది. స్టాంప్‌పై బతుకమ్మ శుభాకాంక్షలు అని తెలుగులో రాసి ఉండడం విశేషం. ఆస్ట్రేలియాలో టీఆర్ఎస్ విభాగం అధ్యక్షుడు నాగేందర్‌రెడ్డి, అభినయ్, జాగృతి ఉపాధ్యక్షులు సోమవారం కవితను తెలంగాణలో భవన్‌లో కలిసి పోస్టల్ స్టాంప్‌ను అందజేశారు.