: తండ్రి ఉద్యోగం కోసం కుమారుడి దారుణం!


గుంటూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కుమారుడి అత్యాశ తండ్రిని హతమార్చేలా చేసింది. మాచర్లలో చోటుచేసుకున్న ఘటన వివరాల్లోకి వెళ్తే... స్థానిక కార్మిక శాఖలో శ్రీనివాసరావు (47) అటెండర్ గా పని చేస్తున్నారు. ఆయనకు రెండు వివాహాలు జరిగాయి. మొదటి భార్య మాధవి 10 ఏళ్ల కిందట మరణించింది. ఆమెకు అమర్ నాథ్ అనే కుమారుడు వున్నాడు. ఆమె మరణంతో శ్రీనివాసరావు రెండో వివాహం చేసుకున్నాడు. రెండవ భార్య భారతి తీవ్ర అనారోగ్యంతో నాలుగేళ్ల క్రితం మృతి చెందింది.

దీంతో శ్రీనివాసరావు సైదమ్మ అనే మహిళతో సహజీవనం చేయడం ప్రారంభించాడు. దీంతో తొలి భార్య కుమారుడు అమర్ నాథ్ తండ్రి ఉద్యోగం తనకు ఇవ్వాలని డిమాండ్ చేయడం ప్రారంభించాడు. ఈ క్రమంలో సైదమ్మతో శ్రీనివాసరావు అనుబంధం మరింత బలంగా మారడంతో తనకు ఉద్యోగం ఇవ్వడేమోనన్న ఆందోళణతో కన్న తండ్రిని రాయితో మోది హత్య చేసి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, భౌతిక కాయాన్ని మార్చురీకి తరలించి, పరారీలో ఉన్న అమర్ నాథ్ కోసం గాలింపు మొదలుపెట్టారు. 

  • Loading...

More Telugu News