: కొత్త సీజేఐగా జస్టిస్ జగదీశ్ సింగ్ కెహర్!
భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా జస్టిస్ జగదీశ్ సింగ్ కెహర్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం తెలిపారు. కాగా, కొత్త ఏడాది జనవరి 3న ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టిఎస్ ఠాకూర్ పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే కొత్త సీజేఐగా జగదీశ్ సింగ్ కెహర్ ను నియమించారు.