: హైదరాబాదు క్రికెట్ అసోసియేషన్ లో 120 కోట్ల కుంభకోణం!
హైదరాబాదు క్రికెట్ అసోసియేషన్ (హెచ్ సీఏ) లో 120 కోట్ల రూపాయల భారీ కుంభకోణం బట్టబయలైంది. హెచ్సీఏలో జరిగిన అవకతవకలపై దర్యాప్తు నిర్వహించిన డెలాయిట్ సంస్థ 120 కోట్ల భారీ కుంభకోణం జరిగిందని నిర్ధారించింది. దీంతో హెచ్సీఏ ప్రెసిడెంట్, మాజీ క్రికెటర్ అర్షద్ ఆయూబ్, సెక్రటరీ జాన్ మెనోజ్ లపై ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో వారిపై పోలీసులు ఐపీసీ 403, 406, 415 సెక్షన్లపై కేసు నమోదు చేశారు. నిందితులపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. దీంతో హైదరాబాదు క్రికెట్ అసోసియేషన్ లో ప్రకంపనలు బయల్దేరాయి.