: అమ్మా! నేను చనిపోతే...నా ఫ్రెండ్స్ కి భారీ మందు పార్టీ ఇవ్వు!: 'పఠాన్ కోట్' దాడిలో పాల్గొన్న ఉగ్రవాది చివరి కోరిక
2015 డిసెంబర్ 30న పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై దాడికి తెగబడ్డ ఉగ్రవాది తన తల్లికి ఫోన్ చేసి మాట్లాడిన మాటలను ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. ఆ ఉగ్రవాది కోరిక వింటే ఎవరైనా నవ్విపోవాల్సిందే! ఆ కోరిక వివరాల్లోకి వెళ్తే... హుస్సేన్ అనే ఉగ్రవాది పాకిస్థాన్ నుంచి తన వెంట ఒక సెల్ ఫోన్ తెచ్చుకున్నాడు. జనవరి 1 ఉదయం 9:20 నిమిషాలకు తన తల్లికి ఫోన్ చేశాడు. 18 నిమిషాలపాటు తన తల్లితో మాట్లాడిన హుస్సేన్ డిసెంబర్ 30న వేకువ జాము 2 గంటలకు తాము భారత్ లో ప్రవేశించామని అన్నాడు. తన బంధువుల గురించి అడిగి తెలుసుకున్నాడు. ఎయిర్ బేస్ పై ఆ రోజు అర్ధరాత్రి దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపాడు. ఈ ఆపరేషన్ లో తాను మరణిస్తే, తన స్నేహితులకు పెద్ద మందుపార్టీ (మద్యం) ఇవ్వాలని తన తల్లిని కోరాడు. ఈ దాడిలో పాల్గొన్న మరో ముగ్గురు సహచరుల పేర్లు కూడా హుస్సేన్ తన తల్లికి చెప్పినట్టు ఎన్ఐఏ అధికారులు తెలిపారు.