: ఆ పాత్ర నా జీవితాన్నే మార్చేసింది: రణ్ వీర్ సింగ్


గత ఏడాది డిసెంబర్ 18న విడుదలైన ‘బాజీరావ్ మస్తానీ’ చిత్రం గురించి నటుడు రణ్ వీర్ సింగ్ తాజాగా ప్రస్తావించాడు. ఈ చిత్రం విడుదలై ఏడాది పూర్తయిన సందర్భంగా ఆ చిత్ర దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీకి రణ్ వీర్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ధన్యవాదాలు తెలిపాడు. ‘ఈ చిత్రంలో నేను పోషించిన పాత్ర నా జీవితాన్ని మార్చివేసింది. సంజయ్ సార్, ఫరెవర్ థ్యాంక్యు’ అని ఆ ట్వీట్ లో పేర్కొన్న రణ్ వీర్, ‘బాజీరావు మస్తానీ’ చిత్ర బృందాన్ని మరిచిపోలేనని అన్నాడు. ఈ సందర్భంగా ‘బాజీరావు మస్తానీ’లోని తన ఫొటోను కూడా పోస్ట్ చేశాడు.
 

  • Loading...

More Telugu News