: హాలీవుడ్ లెజెండరీ నటి సాసా గాబర్ కన్నుమూత


తీవ్రమైన గుండెపోటు కారణంగా హాలీవుడ్ లెజెండరీ నటి సాసా గాబర్ (99) కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆమె భర్త ఫ్రెడరిక్ వోన్ ఆన్హాల్ట్ తెలిపారు. కాలిఫోర్నియాలోని తమ నివాసంలో, బంధువులు, సన్నిహితులు, మిత్రుల మధ్య గాబర్ నిన్న మృతి చెందిందన్నారు. ఆమె మృతిపై హాలీవుడ్ నటులు, ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. కాగా, హంగేరి రాజధాని బుడాపెస్ట్ లో 1917లో ఆమె జన్మించింది. రెండో ప్రపంచయుద్ధం సమయంలో ఆమె అమెరికాకు వలస వెళ్లారు.

‘సాసా’ అనే ముద్దుపేరు ఆమె అసలు పేరు ముందు చేరడంతో సాసా గాబర్ గా ప్రఖ్యాతి చెందింది. రంగస్థల నటిగా తన కెరీర్ ప్రారంభించిన గాబర్ 1936లో ‘మిస్ హంగేరి’ కిరీటాన్ని దక్కించుకుంది.1952వ సంవత్సరంలో హాలీవుడ్ లోకి అడుగుపెట్టిన గాబర్, సుమారు 70 చిత్రాల్లో నటించింది. మొత్తం తొమ్మిది పెళ్లిళ్లు చేసుకున్న ఆమె, తన ఇరవయ్యవ ఏట మొదటి వివాహం చేసుకుంది. కాగా, 'క్వీన్ ఆఫ్ అవుటర్ స్పేస్', 'లిలి', 'మౌలిన్ రోజ్' తదితర చిత్రాల్లో ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి.

  • Loading...

More Telugu News