: తిరుమల శ్రీవారి పుష్కరిణిలో పడి మహిళ మృతి
తిరుమల శ్రీవారి పుష్కరిణిలో పడి ఒక మహిళ మృతి చెందింది. దాంతో పుష్కరిణిని తాత్కాలికంగా మూసివేశామని, సంప్రోక్షణ అనంతరం భక్తులను పుష్కర స్నానానికి అనుమతించనున్నట్లు టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు పేర్కొన్నారు. కాగా, మృతురాలు తిరుపతికి చెందిన నాగరత్నంగా పోలీసులు గుర్తించారు.