: 'ఎయిర్ ఏసియా' న్యూఇయర్ సేల్.. రూ.917కే విమాన టికెట్!


కొత్త ఏడాది నేపథ్యంలో న్యూ ఇయర్ సేల్ ను ప్రారంభిస్తున్నట్లు విమానయాన సంస్థ ఎయిర్ ఏసియా ప్రకటించింది. ఈ సేల్ లో భాగంగా కేవలం రూ.917కే (అన్నీ కలుపుకుని) విమాన టికెట్ ను అందిస్తోంది. 2017 మార్చి 1 నుంచి అక్టోబర్ 30 వరకు ప్రయాణించే వారికి ఈ ఆఫర్ వర్తిస్తుందని పేర్కొంది. బెంగళూరు-కొచ్చి, బెంగళూరు-గోవా, బెంగళూరు-హైదరాబాద్ మార్గాల్లో ఈ ధరకు జనవరి 1 వరకు టికెట్లు కొనుగోలు చేసుకోవచ్చని ఆ ప్రకటనలో పేర్కొంది.

కాగా, న్యూఢిల్లీ- గోవా, న్యూఢిల్లీ- బెంగళూరు మార్గాల మధ్య టికెట్టు ధరలు వరుసగా రూ.2,917, రూ.2,217; బెంగళూరు-గువాహటికి రూ.2,217; బెంగళూరు-చండీగఢ్ కి రూ.2,917; బెంగళూరు- విశాఖపట్టణానికి రూ.1,417 నుంచి టికెట్ ధరలు మొదలవుతాయని ఎయిర్ ఏసియా అధికారులు పేర్కొన్నారు. కాగా, 'గో ఎయిర్' సంస్థ కూడా పలు ఆఫర్లను ప్రకటించింది. ఎంపిక చేసిన కొన్ని మార్గాల్లో రూ.1,057 ప్రారంభ ధరతో ఈ నెల 31 వరకు ఈ ఆఫర్ వర్తిస్తుందని వెబ్ సైట్ ద్వారా పేర్కొంది. 

  • Loading...

More Telugu News