: చెన్నయ్ టెస్ట్ అప్ డేట్స్: ముగిసిన 4వ రోజు ఆట!


చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదో టెస్టు నాలుగో రోజు ఆట ముగిసింది. 391/4 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో బ్యాటింగ్ ప్రారంభించిన మురళీ విజయ్ (29) కరుణ్ నాయర్ (303) ఆచితూచి ఆడారు. మురళీ విజయ్ అవుట్ కావడంతో క్రీజులోకి వచ్చిన రవిచంద్రన్ అశ్విన్ (67) దూకుడుగా ఆడాడు. అనంతరం వచ్చిర రవీంద్ర జడేజా (51) మరింత ధాటిగా ఆడాడు. వీరిద్దరి అండతో చెలరేగిన కరుణ్ నాయర్ పలు రికార్డులు నెలకొల్పాడు.

టీమిండియా కూడా అత్యధిక టెస్టు ఇన్నింగ్స్ స్కోరుతోపాటు టెస్టు స్కోరు కూడా సాధించింది. ఈ క్రమంలో భారత జట్టు తొలి ఇన్నింగ్స్ లో 282 పరుగుల ఆధిక్యం దక్కించుకుంది. అనంతరం సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ జట్టు ఐదు ఓవర్ల పాటు ఆడి వికెట్లేమీ కోల్పోకుండా 12 పరుగులు చేసింది. కెప్టెన్ కుక్ (3), జెన్నింగ్స్ (6) క్రీజులో ఉన్నారు. టెస్టు, టెస్టు సిరీస్ ముగిసేందుకు ఇంకా ఒకరోజు ఆటమిగిలి ఉంది.

  • Loading...

More Telugu News