: గండికోట నిర్వాసితులకు రూ. 480 కోట్లు: దేవినేని ఉమా
గండికోట రిజర్వాయర్ నిర్వాసిత గ్రామాలకు చెందిన ప్రజలు గత గురువారం నాడు జలదీక్షకు దిగిన సంగతి తెలిసిందే. తమకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలంటూ ఆ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు వారి నిరసన కార్యక్రమం కొనసాగింది. పిల్లలు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా మూకుమ్మడిగా అందరూ గండికోట బ్యాక్ వాటర్ లో దిగి నిరసన వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో ఏపీ భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, గండికోట నిర్వాసితులకు రూ. 479.35 కోట్లను మంజూరు చేశామని తెలిపారు. ఏ ఒక్కరికీ అన్యాయం జరిగే ప్రసక్తే లేదని ఆయన అన్నారు.