: 282 పరుగుల ఆధిక్యంలో టీమిండియా!


ఎన్నో ఆశలు, అంచనాలతో భారత్ లో అడుగుపెట్టిన ఇంగ్లండ్ జట్టుకు టీమిండియా మర్చిపోలేని, నిద్రలేని రాత్రులను మిగులుస్తోంది. సిరీస్ ఆద్యంతం మురళీ విజయ్, కేఎల్ రాహుల్, కోహ్లీ, అశ్విన్, తాజాగా కరుణ్ నాయర్ ఇలా భారత ఆటగాళ్లంతా ఇంగ్లండ్ జట్టుకు ముచ్చెమటలు పట్టించారు. చివరిదైన ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ జట్టు అద్భుతంగా ఆడి 477 పరుగులు చేయగా, దీటుగా భారత జట్టు బ్యాట్స్ మన్ రాణించారు.

 ఈ క్రమంలో కేఎల్ రాహుల్, పార్థివ్ పటేల్, కరుణ్ నాయర్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలు రాణించడంతో భారత జట్టు 759 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. దీంతో ఇంగ్లండ్ జట్టు కంటే భారత్ 282 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. కరుణ్ నాయర్ ట్రిపుల్ సెంచురీ చేయగానే టీమిండియా కెప్టెన్ కోహ్లీ ఇన్నింగ్స్ డిక్లేర్ చేస్తున్నట్టు ప్రకటించాడు. దీంతో టీమిండియా టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన టెస్టుగా చెపాక్ టెస్టు నిలిచింది. ఇంకా ఒకరోజు ఆట మిగిలి ఉండడంతో ఈ టెస్టులో భారీ స్కోరు రికార్డులు నెలకొల్పే అవకాశం కనిపిస్తోంది. భారత్ డిక్లేర్ చేయడంతో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. 

  • Loading...

More Telugu News