: ఆదాశర్మ తల్లి వర్కవుట్ తీరు చూసి ఫిదా అయిపోయిన పూరీ జగన్నాథ్
ప్రముఖ సినీ నటి ఆదాశర్మ తల్లి షీలా చేస్తున్న వ్యాయామం వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. తన వర్కవుట్ కు తన తల్లి స్పూర్తి అని చెబుతూ అదా శర్మ తన తల్లి షీలా చేస్తున్న వ్యాయామ వీడియోను సోషల్ మీడియాలో పెట్టింది. ఈ వీడియోలో షీలా మల్లకంభ్ పై అవలీలగా విన్యాసాలు చేస్తూ కనిపించారు. కర్రపై అలాంటి విన్యాసాలు చేయడం చూసిన ఆదా శర్మ అభిమానులు ఆమెను ప్రశంసల జల్లుల్లో ముంచెత్తారు. ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ 'బిగ్ హగ్' అంటూ ట్వీట్ చేయడంతో ఆయన అభిమానులు కూడా ఆమెను అభినందిస్తున్నారు.