: దిల్ షుక్ నగర్ తీర్పు నేపథ్యంలో సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం
దిల్ షుక్ నగర్ పేలుళ్ల కేసులో దోషులకు శిక్షల ఖరారు తీర్పు రానున్న నేపథ్యంలో హైదరాబాదు పోలీసులు అప్రమత్తమయ్యారు. దీంతో హైదరాబాదులోని సమస్యాత్మక ప్రాంతాల్లో భారీ బందో బస్తు చేపట్టారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు చేపట్టారు. ఎలాంటి శిక్ష విధించినా తమకు ఎలాంటి భయం లేదని ఈ కేసులో దోషులు ప్రకటించిన నేపథ్యంలో న్యాయస్థానం ఎలాంటి తీర్పునివ్వనుందన్న ఆసక్తి అందర్లోనూ నెలకొంది. కాగా, ఈ కేసులో తుది తీర్పు కాసేపట్లో నాంపల్లిలోని ఎన్ఐఏ న్యాయస్థానం వెలువరించనుంది.