: 38 ఏళ్ల తర్వాత అదే ఘనతను సాధించిన టీమిండియా
ఎప్పుడో 38 ఏళ్ల క్రితం 1978-79లో భారత జట్టు సాధించిన ఘనతను... విరాట్ సేన మళ్లీ సాధించింది. చెన్నైలో ఇంగ్లండ్ తో జరుగుతున్న చివరి టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్ లు సెంచరీలు సాధించారు. దీంతో, ఈ సిరీస్ లో ఆరుగురు భారత బ్యాట్స్ మెన్ సెంచరీ సాధించినట్టైంది. వీరిద్దరితో పాటు ఇప్పటికే మురళీ విజయ్, విరాట్ కోహ్లీ, జయంత్ యాదవ్, పుజారాలు సెంచరీ సాధించారు. 1978-79 సీజన్ లో కూడా ఇలాగే ఒకే సిరీస్ లో ఆరుగురు భారత ఆటగాళ్లు శతకాలను బాదారు. ఓవరాల్ గా ఈ సిరీస్ లో భారత్ తరపున ఎనిమిది సెంచరీలు నమోదయ్యాయి. వీటిలో మురళీ విజయ్, విరాట్ కోహ్లీలు చెరో రెండు సెంచరీలు చేశారు.