: మనకేం చేతకాదా? సీబీఐ వచ్చి ఏం చేస్తది?: కేసీఆర్


నయీమ్ ఎన్ కౌంటర్ కేసును సీబీఐకి అప్పగించాలన్న కాంగ్రెస్, బీజేపీ ఎమ్మెల్యేల వాదనలను ఖండిస్తూ, కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసు విచారణ మధ్యలో ఉందని, మరో 15 చార్జ్ షీట్లు దాఖలు కానున్నాయని అసెంబ్లీలో వెల్లడించిన కేసీఆర్, "మనకేం చేతకాదాండి? సీబీఐ వచ్చి ఏం చేస్తది? సీబీఐ వచ్చి పట్టుకున్నారాండీ? సీబీఐ వచ్చి అరెస్ట్ చేసినారు? ఈ 124 మందినీ సీబీఐ అరెస్ట్ చేసినారా? మన పోలీసులు, ఇంత సమర్థవంతమైన పోలీసులు మనకు ఉండంగ, మాకేం చేతగాదన్నట్టు పోయి, కేసును వాళ్లకు అప్పజెప్పాల్నట. పదేళ్లు ఉపేక్షిస్తూ, ఇంటికాడ కూర్చున్నోళ్లు ఆ డిమాండ్ చేస్తున్నరు. మేం పట్టుకుని, దందాలు అరికడుతున్నవాళ్లం సిబీఐకి అప్పగించాల్నా? న్యాయంగా ఉంద ఈ లాజిక్. మీరు మాట్లాడింది ప్రజలు విన్నరు. మేం మాట్లాడింది వింటున్నరు. ఈ కేసు కచ్చితంగా... మన రాష్ట్ర పోలీసులకే క్రెడిట్ దక్కాలే. ఎవరు నేరస్తులున్నా వదిలి పెట్టేది లేదు" అని కేసీఆర్ అన్నారు.

  • Loading...

More Telugu News