jagan: చంద్రబాబు ఇష్టం వచ్చిన అబద్ధాలు చెప్పుకుంటూ వెళుతున్నారు: వైఎస్ జగన్
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీ జీడీపీ గ్రోత్ రేట్ పరిగెడుతోందని అబద్ధాలు చెబుతున్నారని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. ఈ రోజు విజయనగరంలోని జగన్నాథ్ పంక్షన్ హాల్‌లో నిర్వహించిన యువభేరిలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు ఇష్టం వచ్చిన అబద్ధాలు చెప్పుకుంటూ పోతున్నారని అన్నారు. జీడీపీ గ్రోత్ రేట్‌పై మాత్రమే కాకుండా రాష్ట్రానికి ఎన్నో పెట్టుబడులు వస్తున్నాయని అంటూ, ఏవేవో మాట్లాడుతున్నారని జగన్ అన్నారు. ఓ వైపు సర్వేల్లో రాష్ట్ర జీడీపీ గురించి ఓ విధంగా వివరణ వస్తుంటే, మరోవైపు గ్రోత్ రేట్ పై చంద్రబాబు సర్కారు అబద్ధాలు ప్రచారం చేసుకుంటోందని ఆయన అన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలు విని పెట్టుబడి పెట్టేవారు కూడా వెనక్కి వెళ్లిపోయే పరిస్థితి ఏర్పడుతోందని అన్నారు.