: రెడ్ లైట్ ఏరియాలో కూడా పేటీయం చెల్లింపులు!
పెద్దనోట్ల రద్దుతో నగదు రహిత లావాదేవీలు రెడ్ లైట్ ఏరియాలకు కూడా చేరాయి. నాగ్ పూర్ లోని గంగాజమునా రెడ్ లైట్ ఏరియాలోని సెక్స్ వర్కర్లు ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. క్యాష్ లేకపోయినా సరే... పేటీఎం ద్వారా చెల్లింపు జరపవచ్చు అంటూ ప్రకటించారు. అంతేకాదు, పేటీఎం చెల్లింపులు స్వీకరించబడును అంటూ ఏకంగా పాంప్లెట్స్ కూడా పంచారు. మరోవైపు, తమ వద్ద స్మార్ట్ ఫోన్లు ఉన్నాయని... ఆన్ లైన్ లో నగదు ఎలా తీసుకోవాలో శిక్షణ ఇవ్వాలని మరికొందరు సెక్స్ వర్కర్లు కోరుతున్నారు.