: ఎంసెట్ ప్రశ్నాపత్రం లీక్ కేసు విషయంపై.. శాసనమండలి నుంచి వాకౌట్ చేసిన కాంగ్రెస్


ఈరోజు తెలంగాణ శాసనమండలి సమావేశాలు వాడీవేడిగా కొనసాగాయి. ఎంసెట్ ప్రశ్నాపత్రం లీక్ అయిన అంశంపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. ఈ కేసులో ఇప్పటి దాకా ఎంత మందిని అరెస్ట్ చేశారని మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ ప్రశ్నించారు. ఈ విషయంలో ప్రభుత్వం తీసుకున్నవన్నీ కంటి తుడుపు చర్యలే అని ఆరోపించారు. అసలైన నిందితులను ఇంతవరకు పట్టుకోలేదని విమర్శించారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నవారిని కఠినంగా శిక్షించాలని కోరారు. కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. దీనిపై విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి స్పందిస్తూ, కేసును సీఐడీకి అప్పగించామని తెలిపారు. 49 మందిని అరెస్ట్ చేశామని... దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని చెప్పారు. అయితే, మంత్రి ఇచ్చిన సమాధానం తృప్తికరంగా లేదని చెబుతూ, కాంగ్రెస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. 

  • Loading...

More Telugu News