: అసహనంతో మోదీని కామెంట్ చేస్తే... తల పగులగొట్టాడు


నోట్ల కోసం బ్యాంకుల వద్ద, ఏటీఎంల వద్ద గంటల తరబడి నిలబడాల్సి వస్తుండటంతో... జనాల్లో అసహనం పెరిగిపోతోంది. దీంతో, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని పలువురు బాహాటంగానే విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో, ఢిల్లీలోని ఓ ఏటీఎం క్యూలో నిల్చున్న 45 ఏళ్ల లాలన్ సింగ్ అనే వ్యక్తి... అసహనంతో ప్రధాని మోదీపై కామెంట్ చేశాడు. మోదీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయంతో, ప్రజలంతా బాధ పడాల్సి వచ్చిందని అన్నాడు.
వెంటనే, పక్కనే ఉన్న ఆషిక్ అనే యువకుడు లాలన్ తో వాగ్వాదానికి దిగాడు. ఈ గొడవ కాస్తా ముదరడంతో... తీవ్ర ఆగ్రహానికి గురైన ఆషిక్ క్రికెట్ స్టంప్స్ తీసుకుని లాలన్ తలపై మూడు సార్లు బలంగా బాదాడు. దీంతో, లాలన్ తీవ్ర రక్తస్రావంతో స్పృహ కోల్పోయాడు. ఆయనను ఆసుపత్రికి తరలించగా... మూడు కుట్లు పడ్డాయి. ఈ ఘటనపై జైత్ పూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. 

  • Loading...

More Telugu News