: 'అమ్మ' కు భారతరత్న కోసమే... నేడు మోదీని కలవనున్న పన్నీర్ సెల్వం


దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలితకు భారతరత్న ఇవ్వడం, పార్లమెంటులో ఆమె కాంస్య విగ్రహాన్ని ప్రతిష్టించేలా మోదీ ప్రభుత్వాన్ని ఒప్పించడమే లక్ష్యంగా పన్నీర్ సెల్వమ్ మరికాసేపట్లో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారు. తామంతా అమ్మగా పిలుచుకునే జయలలితకు దేశ అత్యున్నత పురస్కారాన్ని ఇవ్వాలని ఈ నెల 10న తమిళనాడు క్యాబినెట్ తీర్మానం చేసిన సంగతి తెలిసిందే.

అలాగే ఇటీవలి వార్దా తుపాను రాష్ట్రంలో సృష్టించిన బీభత్సం గురించి కూడా ప్రధానికి పన్నీర్ సెల్వం వివరించనున్నారు. డిసెంబర్ 12న తమిళనాడులో తీవం దాటిన తుపాను ప్రభావానికి చెన్నై నగరమంతా అతలాకుతలం కాగా, కనీసం 10 మంది మరణించిన సంగతి తెలిసిందే. తుపాను కారణంగా ఏర్పడిన నష్టాన్ని అధిగమించేందుకు కొంత ఆర్థిక సాయాన్ని పన్నీర్ సెల్వం కోరనున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News