: తొలి టెస్టు సెంచరీతో సత్తా చాటిన కరణ్ నాయర్


నిన్న కేఎల్ రాహుల్ చేసిన 199 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ తో ఇంగ్లండ్ భారీ స్కోరుకు దీటైన సమాధానం ఇచ్చిన భారత జట్టు ఈ ఉదయం మరింతగా విజృంభించింది. సెషన్ ఆరంభం నుంచి ఓ వైపు కరణ్ నాయర్, మరోవైపు మురళీ విజయ్ ఆచితూచి ఆడుతూ, చెత్త బంతులను బౌండరీకి తరలిస్తూ, స్కోరును ముందుకు తీసుకెళ్లారు.
ఈ క్రమంలో 123వ ఓవర్ చివరి బంతికి నాయర్, ఓ ఫోర్ సాధించడం ద్వారా సెంచరీ పూర్తి చేశాడు. మొత్తం 185 బంతులను ఎదుర్కొన్న నాయర్, 8 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో, తన కెరీర్ లో తొలి టెస్టు సెంచరీ సాధించాడు. మరో ఎండ్ లో మురళీ విజయ్ 29 పరుగులతో ఆడుతున్నాడు. ప్రస్తుతం భారత స్కోరు 123 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 435 పరుగులు కాగా, ఇంగ్లండ్ చేసిన 477 పరుగుల కన్నా 42 పరుగుల వెనుకన ఉంది.

  • Loading...

More Telugu News