: పెళ్లి విందులో కాల్పులు జరిపిన మాజీ పోలీసు అధికారి కుమారుడు
మన దేశంలో గన్ కల్చర్ ఎక్కువవుతోంది. తాజాగా, ఢిల్లీలోని నాంగ్లోయి ప్రాంతంలో జరిగిన ఓ వివాహ వేడుకలో ఓ మాజీ పోలీసు అధికారి కుమారుడు ధర్మేంద్ర (27) కాల్పులు జరిపాడు. విందు కార్యక్రమం సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ప్లేట్లు శుభ్రం చేస్తున్న మహమ్మద్ యూసుఫ్, కషీఫ్ లు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని హుటాహుటీన ఆర్ఎంఎల్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ, మహమ్మద్ యూసుఫ్ చనిపోయాడు. కషీఫ్ నెమ్మదిగా కోలుకుంటున్నాడు. ఈ క్రమంలో, ధర్మేంద్రతో పాటు అతని తండ్రిని కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ధర్మేంద్రకు రివాల్వర్ ఎక్కడ నుంచి వచ్చిందన్న కోణంలో విచారణ జరుపుతున్నారు.