: ఐఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్.. త్వరలో డ్యూయల్ సిమ్‌తో ఎంట్రీ!


యాపిల్ ఐఫోన్ ప్రేమికులకు కంపెనీ శుభవార్త చెప్పింది. ఫోన్లన్నీ డ్యూయల్ సిమ్‌తో అందుబాటులోకి వస్తున్న వేళ సింగిల్‌ సిమ్‌తో కాస్తంత వెనకబడిపోయిన ఐఫోన్ త్వరలో రెండు సిమ్‌లతో మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఈ మేరకు యాపిల్ సంస్థ తాజాగా డ్యూయల్ సిమ్ పేటెంట్ హక్కులు పొందినట్టు సమాచారం. డ్యూయల్ సిమ్ ఫోన్లకు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉన్నప్పటికీ ఈ విషయంలో ‘యాపిల్’ సింగిల్ సిమ్‌తోనే మార్కెట్లో తన సత్తా చాటుతోంది.

అయితే గత నాలుగేళ్లుగా డ్యూయల్ సిమ్ ఫోన్లకు డిమాండ్ విపరీతంగా పెరగడంతో ఆ లోటును భర్తీ చేసేందుకు ‘యాపిల్’ నడుం బిగించింది. డ్యూయల్ సిమ్ టెక్నాలజీకి అమెరికాలో పేటెంట్ హక్కులను పొందిన సంస్థకు చైనాలోనూ అనుమతి లభించినట్టు సంస్థకు చెందిన ఓ అధికారి వెల్లడించారు. వచ్చే ఏడాది మార్కెట్లోకి ప్రవేశించనున్న ఐఫోన్8లో పలు మార్పులు సహా డ్యూయల్ సిమ్ సదుపాయం కూడా ఉన్నట్టు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News