: నోట్ల రద్దుకు జై కొట్టిన ప్రధాని సతీమణి.. దేశ పురోగతి కోసం మరికొన్ని చర్యలు తీసుకోవాలని పిలుపు


పెద్దనోట్లు రద్దు చేస్తూ ప్రధాని నరేంద్రమోదీ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన సతీమణి జశోదాబెన్ స్వాగతించారు. నల్లధనానికి, అవినీతికి ఈ నిర్ణయంతో ముకుతాడు పడుతుందని ఆశాభావం వ్యక్తం  చేశారు. దేశం పురోగతిలో పయనించాలంటే ఇటువంటి చర్యలు మరికొన్ని తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు. నవంబరు 8న పెద్దనోట్లు రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన తర్వాత ప్రతిపక్షాలన్నీ మూకుమ్మడిగా ప్రధానిపై విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. ప్రధాని మోదీని వ్యతిరేకించే బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌లు సైతం నోట్ల రద్దును బాహాటంగా సమర్థించారు.

  • Loading...

More Telugu News