: సందర్శకుల కోసం తిరిగి తెరచుకున్న ఈఫిల్ టవర్


పారిస్ లోని ప్రఖ్యాత ఈఫిల్ టవర్ తిరిగి తెరచుకుంది.  117 ఏళ్ల ఈ కట్టడానికి పలు మరమ్మతులు చేసి రంగులు వేసే పనిని ఇటీవల నిర్వహించారు. అయితే, పాత పెయింట్ కారణంగా తాము అనారోగ్యానికి గురవుతున్నామని పెయింట్ వేస్తున్న కార్మికులు సమ్మెకు దిగారు.  కార్మికుల సమ్మె కారణంగా సుమారు ఐదు రోజులుగా ఈఫిల్ టవర్  సందర్శనకు అనుమతి ఇవ్వలేదు. అయితే, యాజమాన్యానికి, కార్మికులకు మధ్య ఈరోజు జరిగిన చర్చలు సఫలీకృతమయ్యాయి. దీంతో, కార్మికులు సమ్మె విరమించారు. క్రిస్మస్ పండగ నేపథ్యంలో ఈఫిల్ టవర్ ను సందర్శించే వారి సంఖ్య అధికంగా ఉంటుందని సమాచారం.

  • Loading...

More Telugu News