: పెద్దపల్లిలో ఏఎస్ఐ ఆత్మహత్య


పెద్దపల్లి జిల్లాలోని కాల్వ శ్రీరాంపూర్ స్టేషన్ లో ఏఎస్ఐగా పనిచేస్తున్న రామనాథం ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీస్ క్వార్టర్స్ లో నివసిస్తున్న ఆయన ఈరోజు సాయంత్రం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ కలహాల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News