: రెచ్చిపోయిన తిరుమల శ్రీవారి గజరాజు.. మావటికి తీవ్ర గాయాలు
తిరుమల శ్రీవారి గజరాజు అవనిజకు మరోసారి కోపం వచ్చింది. వరాహస్వామి ఆలయం దగ్గర మావటి గంగయ్యపై దాడి చేసింది. రెచ్చిపోయిన గజరాజును అదుపు చేయబోయిన గంగయ్యపై దాడి చేయడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. దాంతో అతనిని తిరుమలలోని అశ్విని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శ్రీవారి వాహన సేవ ఊరేగింపుకు ‘అవనిజ’ను తీసుకువచ్చే సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. కాగా, 2010 బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులపై కూడా ‘అవనిజ’ దాడి చేసింది.