: దారి తప్పిన ‘జబర్దస్త్’ రష్మీ.. నంద్యాలకు బదులు కరీంనగర్ తీసుకువెళ్లిన డ్రైవర్!
‘జబర్దస్త్’ కార్యక్రమంతో ప్రజాదరణ పొందిన నటి రష్మీని నంద్యాల తీసుకువెళ్లమంటే కరీంనగర్ తీసుకువెళ్లాడట ఆమె కారు డ్రైవర్. ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాదు నుంచి కర్నూలు జిల్లా నంద్యాలకు రష్మీ కారులో బయలుదేరింది. అయితే, కారు దారి తప్పి కరీంనగర్ చేరుకుంది. చివరికి, ఏదో విధంగా నంద్యాలలో జరుగుతున్న కార్యక్రమానికి ఆలస్యంగా రష్మీ చేరుకుంది. దీంతో, అక్కడి ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పిన రష్మీ, జరిగిన విషయం ఇదీ అని చెప్పింది. అనంతరం, అక్కడ నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న రష్మీ డ్యాన్స్ చేసింది.