: న్యూ ఇయర్ వేడుకలకు గోవా వెళతాను: రకుల్ ప్రీత్ సింగ్


న్యూ ఇయర్ వేడుకలకు గోవా వెళతానని ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ చెప్పింది. నాలుగేళ్ల నుంచి ట్రై చేస్తున్నప్పటికీ ఒక్కసారి కూడా న్యూఇయర్ వేడుకలు జరుపుకోలేకపోయానని, రాబోయే న్యూ ఇయర్  వేడుకలు మాత్రం కచ్చితంగా జరుపుకుంటానని చెప్పింది. ఇందు కోసం ఎప్పటి నుంచో ప్లాన్ చేశానని, ఈ ఏడాది మొదట్లోనే తన మేనేజర్ కు ఈ విషయం చెప్పానని రకుల్ పేర్కొంది.
డిసెంబర్ 30, 31, జనవరి 1న ఎటువంటి షూటింగుల్లోను పాల్గొనని ముందే చెప్పేశానని తెలిపింది. తన స్నేహితులతో కలిసి గోవా వెళతానని, అందుకోసం.. రెండు, మూడు ఫ్లైట్లలో టికెట్ లు కూడా బుక్ చేసుకున్నానని, సమయాన్ని బట్టి ఏదో ఒక ఫ్లైట్ లో గోవా వెళ్లిపోతానని రకుల్ నవ్వుతూ చెప్పింది.
  

  • Loading...

More Telugu News