: చేతిలో పేలిన మొబైల్ ఫోన్..పాప్ సింగర్ కు తీవ్ర గాయాలు!
మొబైల్ ఫోన్ చేతిలో పేలిన సంఘటనలో అమెరికన్ పాప్ సింగర్ సీలో గ్రీన్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఫేస్ బుక్ లైవ్ వీడియోను చిత్రీకరిస్తున్న సమయంలో నిన్న రాత్రి ఈ సంఘటన జరిగినట్లు సమాచారం. ఓ ఆన్ లైన్ వెబ్ సైట్ కథనం ప్రకారం, కొత్త ప్రాజెక్టు కోసం మ్యూజిక్ చేస్తున్న సమయంలో ఒక వీడియోను పోస్టు చేద్దామని ఆయన ప్రయత్నిస్తున్న సమయంలో ఈ సంఘటన జరిగినట్లు గ్రీన్ పేర్కొన్నట్లు ఆ కథనంలో పేర్కొంది. కాగా, ఈ సంఘటనతో తాను చాలా అప్ సెట్ అయ్యానని,ప్రస్తుతం తాను కోలుకుంటున్నానని, బాగానే ఉన్నానని సీలో గ్రీన్ పేర్కొన్నారు.