: ఆ రూమర్ తో నాకు చాలా కోపం వచ్చింది: రకుల్ ప్రీత్ సింగ్


తనకు ఎవరో ప్లాట్ కొనిచ్చారనే రూమర్ తో చాలా కోపమొచ్చిందని ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ చెప్పింది. ఒక న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో..  ‘ఈ మధ్య ఎవరో ప్లాట్ ఇప్పించారని విన్నాం?' అనే ప్రశ్నకు ఆమె సమాధానం చెబుతూ...‘ఈ రూమర్ తో నాకు చాలా కోపం వచ్చింది. ఒకవేళ, ఆ విధంగా ఇచ్చేవారు ఎవరైనా ఉంటే, ఇక నేను ఇలా యాక్టింగ్ చేసుకుంటూ ఎందుకు పని చేయాలి? నాకు 2.5 లేదా 3 కోట్ల రూపాయల విలువ చేసే హౌస్ ఇస్తే నేను ఈ పని మానేయచ్చుగా! ఆ విధంగా ఇచ్చేవాళ్లుంటే.. డైమండ్స్ ను, కార్లను కూడా వాళ్లనే ఇచ్చేయమంటాను.
ఆ రూమర్ గురించి నా కంటే ముందే మా నాన్నకు తెలిసింది. ఇటువంటి రూమర్స్ ను పట్టించుకోవద్దని మా నాన్న నాకు ధైర్యం చెప్పారు. నా తల్లిదండ్రులు నన్ను తప్పుగా అర్థం చేసుకున్న సంఘటనలు ఇంతవరకూ ఎప్పుడూ రాలేదు. ఒకవేళ, అటువంటి పరిస్థితి వస్తే నాకు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే, నా తల్లిదండ్రులే నాకు పెద్ద సపోర్ట్’ అని రకుల్ ప్రీత్ సింగ్ చెప్పింది.

  • Loading...

More Telugu News