: తెలుగులో ఆ రెండు చిత్రాలంటే నాకు చాలా ఇష్టం: రకుల్ ప్రీత్ సింగ్


తెలుగులో ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘బొమ్మరిల్లు’ చిత్రాలంటే తనకు చాలా ఇష్టమని అందాల తార రకుల్ ప్రీత్ సింగ్ చెప్పింది. ఒక న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, తనకు ఖాళీ సమయం దొరికితే సినిమాలు చూస్తానని, ఫ్రెండ్స్ తో గడుపుతానని చెప్పింది. ఇప్పటివరకు లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటించే అవకాశం తనకు రాలేదని, అవకాశం వస్తే కనుక తప్పకుండా చేస్తానని చెప్పింది. తన అభిమాన దర్శకులు అడిగితే కనుక, ఏమాత్రం ఆలోచించకుండా వారి చిత్రాల్లో నటించడానికి ‘ఓకే’ చెప్పేస్తానని చెప్పింది. మురుగదాస్, రాజమౌళి, మణిరత్నం ..ఇలాంటి దర్శకుల నుంచి ఆఫర్ వచ్చినప్పుడు ఎటువంటి ఆలోచన చేయకుండానే నటించేస్తానని రకుల్ చెప్పుకొచ్చింది.

  • Loading...

More Telugu News