: ప్రతి రోజూ విస్తుగొలిపే విషయాలు.. అనంతపురంలో రైతు ఖాతాలో రూ.1.84 కోట్ల డిపాజిట్
పెద్దనోట్ల రద్దు తరువాత విపరీతంగా నగదు లావాదేవీలు జరుగుతున్న నేపథ్యంలో పేదల ఖాతాల్లో లక్షలకొద్దీ డబ్బు పడుతున్న ఘటనలు ప్రతిరోజూ వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా అనంతపురం జిల్లా పుట్లూరు మండలం కోమటికుంట్లకు చెందిన ఓ రైతు ఖాతాలో కోటి 84 లక్షల రూపాయల డబ్బు డిపాజిట్ అయింది. తన సెల్‌ఫోన్‌కి బ్యాంకు నుంచి వచ్చిన ఈ సందేశాన్ని చూసుకున్న రైతు శ్రీనివాసులు నాయుడు షాక్‌కు గురయ్యాడు.
తాడిపత్రిలో తనకు ఉన్న ఆంధ్రాబ్యాంకు ఖాతాలో ఈ డబ్బుపడిందని, అయితే, తమ దగ్గర అంత పెద్ద మొత్తంలో నగదు లేదని ఆయన భార్య సుజాత తెలిపింది. ఎవరో నల్లకుబేరుడే ఈ డబ్బును ఆయన ఖాతాలో వేసి ఉండవచ్చని అనుకుంటున్నారు. ఈ రోజు బ్యాంకుకి సెలవు కావడడంతో బ్యాంకు సిబ్బందిని ఈ అంశంపై ఆరా తీసే అవకాశం లేకుండా పోయింది.