: హైదరాబాద్‌కు రూ.8వేల కోట్ల నగదు దిగుమతి.. రూ.2700 కోట్ల గోల్డ్ కొనుగోళ్లు!


పెద్ద‌నోట్ల‌ను ర‌ద్దు చేస్తూ కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకున్న త‌రువాత హైద‌రాబాద్‌లో జ‌రిగిన అక్ర‌మ లావాదేవీల‌పై ‘ఇండియా టుడే’ ఛానెల్ ఈ రోజు ఓ సంచ‌ల‌న కథనాన్ని ప్ర‌సారం చేసింది. నవంబర్‌ 8 నుంచి 30 వ‌ర‌కు న‌గ‌రంలో రూ. 2,700 కోట్ల విలువ చేసే బంగారు బిస్కెట్లను ప‌లువురు కొనుగోళ్లు చేసినట్టు ఎన్‌పోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్ గుర్తించింద‌ని ఆ ఛానెల్ లో పేర్కొన్నారు. బంగారం కొనుగోళ్లు చేసిన వారంతా అజ్ఞాతంలోకి వెళ్లిపోయార‌ని తెలిపింది. నగరానికి రూ. 8వేల కోట్ల నగదు కూడా దిగుమతి జరిగిందని చెప్పింది. హైద‌రాబాద్‌లో ఈ నెల 1 నుంచి 10వ తేదీ వ‌ర‌కు బులియన్ ఎంతో వృద్ధిని సాధించింద‌ని, హైద‌రాబాద్‌కు ఏకంగా 1,500 కిలోల బంగారం దిగుమ‌తి అయింద‌ని తెలిపింది.

 పెద్ద నోట్ల ప్ర‌క‌ట‌న రాగానే నవంబర్‌ 8, 9 తేదీ ల్లో హైద‌రాబాద్‌లోని ఓ బంగారు దుకాణంలో వందకోట్ల రూపాయ‌ల‌కుపైగా ప‌సిడి అమ్మకాలు జరిగినట్టు చెప్పింది. న‌గ‌రంలోని ముసద్దిలాల్‌ జువెల్లర్స్ త‌మ క‌స్ట‌మ‌ర్ల నుంచి  అడ్వాన్స్‌డ్‌ చెల్లింపులు వ‌చ్చాయ‌ని, ఆర్డర్లు వ‌చ్చాయ‌ని చెప్పుకుంటూ 5,200 మంది వినియోగదారులకు ఈ అమ్మకాలు చేసిందని ఈడీ తెలిపిన‌ట్లు ఆ ఛానెల్ పేర్కొంది. న‌గ‌రంలోని ప‌లు బ్యాంకుల ద్వారా హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్‌కు ఈ బంగారం వ‌చ్చింద‌ని తెలిపింది.

  • Loading...

More Telugu News