: ప్రధాని మోదీతో భేటీ కానున్న పన్నీర్ సెల్వం


ప్రధాని నరేంద్ర మోదీని తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం కలవనున్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి  ఢిల్లీ పర్యటనకు వెళుతున్న ఆయన ప్రధానితో రేపు సమావేశం కానున్నారు. దివంగత సీఎం జయలలితకు దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారత రత్న’ను ఇవ్వాలని, పార్లమెంట్ లో జయలలిత కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మోదీని కోరనున్నారు. అంతేకాకుండా, ఇటీవల సంభవించిన వార్దా తుపాన్ కారణంగా రాష్ట్రానికి కలిగిన నష్టంపై సాయం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేయనున్నారు.

  • Loading...

More Telugu News