: బైక్ ను ఢీకొట్టిన కారు.. మహిళ మృతదేహం ఎగిరివెళ్లి కారుపై పడింది !
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఒక మహిళ ఎగిరివెళ్లి కారు మీదపడడంతో.. ఆ మృతదేహంతో సహా కారు వెళ్లిపోయిన సంఘటన మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల వద్ద జరిగింది. బైక్ పై వెళుతున్న భార్యాభర్తలను వేగంగా వస్తున్న కారు ఢీకొట్టింది. బైక్ పై ఉన్న మహిళ ఎగిరివెళ్లి కారుపై పడింది. అయినప్పటికీ, డ్రైవర్ కారును ఆపకుండా సుమారు మూడు కిలోమీటర్ల వరకు వెళ్లిపోయాడు. ఇది గమనించిన గ్రామస్థులు కారును అడ్డుకున్నారు. దీంతో, కారు నడుపుతున్న వ్యక్తి ఆ కారును వదిలేసి పరారయ్యాడు. బాధితులు మూసాపేట మండలం గాజులపేట వాసులుగా పోలీసులు గుర్తించారు. ఈ సంఘటనలో గాయపడ్డ బాధితుడిని మహబూబ్ నగర్ ఆసుపత్రికి తరలించారు.