: రాజకీయాలను సినిమాల్లా, సీరియళ్లలా మార్చేశారు: ‘లోక్ సత్తా’ జయప్రకాష్ నారాయణ


ప్రస్తుతం ఉన్న నాయకులు రాజకీయాలను సినిమాల్లా, సీరియళ్లలా మార్చేశారని లోక్ సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ ఎద్దేవా చేశారు. పెద్దనోట్ల రద్దుపై ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు హర్షించారని, మోదీపై నమ్మకం ఉంది కనుకనే ప్రజలు సహనం పాటిస్తున్నారని అన్నారు. అయితే, పదిహేను లక్షల గ్రామాలు ఉన్న మన దేశంలో క్యాష్ లెస్ వ్యవస్థను ఏ విధంగా తీసుకువస్తారని, చేసిన పొరపాట్లను మోదీ సరిదిద్దుకోవాలని ఆయన అన్నారు. దేశంలోనే ఏపీని నంబర్ వన్ స్థానంలో నిలబెడతానన్న సీఎం చంద్రబాబు, ఆ మాటను నిజం చేసి చూపాలని  జయప్రకాష్ నారాయణ డిమాండ్ చేశారు. 

  • Loading...

More Telugu News