: ‘పాక్’లో భారతీయ చిత్రాల ప్రదర్శనపై నిషేధం ఎత్తివేత


పాకిస్థాన్ లో భారతీయ చిత్రాల ప్రదర్శనపై తాత్కాలిక నిషేధాన్ని ఎత్తివేశారు. ఈ మేరకు పాకిస్థాన్  ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రకటించింది. పాక్ లో భారతీయ చిత్రాల నిషేధం వల్ల దానిపై ఆధారపడ్డ థియేటర్ల యజమానులు, ఇతర వ్యాపారులపై ఆ ప్రభావం పడుతోందని, అందుకే, ఈ నిర్ణయం తీసుకున్నట్లు అసోసియేషన్ చైర్మన్ జోరైష్ లషరి పేర్కొన్నారు. థియేటర్ యజమానులు తమంతట తాముగా  భారతీయ చిత్రాల ప్రదర్శనను నిలిపివేశారే కానీ, నిషేధం విధించలేదన్నారు.  రేపటి నుంచి పాక్ లో భారతీయ సినిమాలను ప్రదర్శించనున్నట్లు పేర్కొన్నారు. బాలీవుడ్ ప్రముఖ నటుడు అమీర్ ఖాన్ నటించిన ‘దంగల్’ చిత్రం కోసం పాక్ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నట్లు సమాచారం. కాగా, జమ్మూకాశ్మీర్ లో ఉరీ ఉగ్రదాడి అనంతరం భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారతీయ చిత్రాల ప్రదర్శనను పాక్ లో నిషేధిస్తున్నట్లు నాడు ప్రకటించారు.

  • Loading...

More Telugu News