: సూరత్ లో నగదురహిత వివాహం.. వెరీ వెరీ స్పెషల్!


పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో దేశంలో ఎన్నో పెళ్లిళ్లు వాయిదాపడిపోతోన్న విష‌యం తెలిసిందే. అయితే, కొంద‌రు మాత్రం నిరాడంబ‌రంగా అతి త‌క్కువ ఖ‌ర్చుతో పెళ్లి చేసుకుంటున్నారు. ఇక పెళ్లికి వ‌చ్చిన వారు కానుక‌లేమీ తీసుకురావ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో గుజ‌రాత్‌లోని సూర‌త్‌లో నిన్న‌ జ‌రిగిన ఓ పెళ్లి  క్యాష్‌లెస్ వివాహంగా పేరు సంపాదించింది. పెళ్లికి వ‌చ్చిన అతిథులు పెళ్లికొడుకు, పెళ్లి కూతురికి కానుక‌లు చెల్లించుకోవడానికి పెళ్లి వేడుక‌లో స్వైపింగ్ మిష‌న్‌ను ఏర్పాటు చేశారు.

మ‌రికొంద‌రు చెక్కుల రూపంలో కానుక‌లు చ‌దివించారు. పెళ్లిలో వేడుక‌కు వ‌చ్చిన అతిథులు త‌మ వ‌ద్ద ఉన్న క్రెడిట్‌, డెబిట్ కార్డుల‌ను స్వైపింగ్ మిష‌న్ల‌లో పెడుతూ ఫొటోల‌కు పోజులు ఇచ్చారు. నగదు కొరత ఏర్పడిన నేపథ్యంలో తమ వివాహం ఏ ఆటంకాలు లేకుండా జరగడం పట్ల వధూవరులు ఆనందం వ్యక్తం చేశారు. 

  • Loading...

More Telugu News