: హైదరాబాద్ లో రూ.66 లక్షల కొత్త రూ.2,000 నోట్లు పట్టివేత


డీమోనిటైజేషన్ అనంతరం జరుగుతున్న తనిఖీల్లో పెద్ద ఎత్తున కొత్త నోట్లు పట్టుబడుతున్నాయి. హైదరాబాద్ లో గత రెండు రోజుల్లో రూ.66 లక్షల రూపాయల విలువ చేసే రూ.2,000 నోట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హిమాయత్ నగర్ లోని తెలుగు అకాడమీ సమీపంలో శుక్రవారం రాత్రి ఆదాయపన్ను శాఖ అధికారులకు కొందరు పట్టుబడ్డారు. అధికారులను చూసి అపార్ట్ మెంటులోకి పారిపోతున్న వారిని పట్టుకుని సోదా చేయగా... రూ.36 లక్షల విలువ చేసే రూ.2,000 నోట్లు వెలుగు చూశాయి.

మరో ఘటనలో శనివారం ట్యాంక్ బండ్ పై తనిఖీలు జరుపుతున్న పోలీసులు, ఐటీ అధికారుల సంయుక్త బృందం హోండా యాక్టివాపై వేగంగా వెళుతున్న ఓ వ్యక్తిని అడ్డగించింది. అతడ్ని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా రూ.30 లక్షల విలువైన రూ.2,000 నోట్లు పట్టుబడినట్టు సమాచారం. తాజా ఘటనల నేపథ్యంలో అధికారులు తమ దాడులను మరింత ముమ్మరం చేశారు. 

  • Loading...

More Telugu News