: వేములవాడలో కార్డన్‌ సెర్చ్‌.. 90 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు


సిరిసిల్ల రాజన్న జిల్లా వేములవాడ పట్టణంలో ఈ రోజు తెల్ల‌వారు జామున మొత్తం 300 మంది పోలీసులతో నిర్బంధ త‌నిఖీలు నిర్వ‌హించారు. త‌నిఖీల్లో భాగంగా దేవస్థానం వసతి గృహాలు, స్థానికంగా ఉన్న‌ ప్రైవేటు లాడ్జిలు, ఇళ్లల్లో సోదాలు జ‌రిపిన పోలీసులు 90 మంది అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. సరైన పత్రాలు చూప‌ని మొత్తం 250 వాహనాలను సీజ్ చేశారు.  ఈ త‌నిఖీలు ఎస్పీ విశ్వజిత్ ఆధ్వర్యంలో జ‌రిగాయి. ఇందులో డీఎస్పీ సుధాకర్, సీఐలు, ప‌లువురు ఎస్సైలు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News