: ఏడు నెలల పసికందులో మరో శిశువు.. శస్త్రచికిత్సతో బయటకు తీసిన వైద్యులు
ఏడు నెలల పసికందు కడుపులో మరో శిశువును చూసిన వైద్యులు షాక్‌కు గురయ్యారు. ఆపరేషన్ చేసి విజయవంతంగా లోపలి శిశువును బయటకు తీశారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన రాజ్‌కుమార్, సౌమ్య దంపతులకు మెర్సీ(ఏడు నెలలు) రెండో సంతానం. ఇద్దరూ ఉద్యోగులే కావడంతో మెర్సీ నాయనమ్మ సంరక్షణలో ఉంటోంది. ఇటీవల మెర్సీ తరచుగా ఏడుస్తుండడంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లారు. చిన్నారిని పరీక్షించిన వైద్యులు ఆమె కడుపులో గడ్డ ఉందని నిర్ధారించారు.
ఈనెల 15న మరో ప్రైవేటు ఆస్పత్రిలో చూపించగా స్కానింగ్ చేసిన వైద్యులు ఆశ్చర్యపోయారు. పాప కడుపులో మరో శిశువు ఉన్నట్టు గుర్తించారు. దీంతో ఈనెల 16న వైద్యులు ఆపరేషన్ చేసిన చిన్నారి కడుపు నుంచి వంద గ్రాముల బరువున్న మరో శిశువును బయటకు తీశారు. ఈ శిశువుకు తల, కాళ్లు, చేతులు, నడుము, పిరుదులు, ఉన్నాయని, అయితే పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందలేదని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం మెర్సీ కోలుకుంటోంది.