: బ్యాంకు ఖాతాలు లేనివారికి శుభవార్త.. మండల కార్యాలయాల్లో ఈనెల 20 నుంచి ఖాతా తెరిచే అవకాశం


బ్యాంకు ఖాతాలు లేనివారికి శుభవార్త. ఈనెల 20 నుంచి 23వ తేదీ వరకు అన్ని మండల కార్యాలయాల్లో ఖాతాలు తెరుచుకునే అవకాశం కల్పిస్తున్నట్టు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నగదు  రహిత లావాదేవీలపై ప్రజలను చైతన్య పరిచే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఖాతా తెరవాలనుకున్నవారు రెండు ఫొటోలు, ఏదైన ఒక గుర్తింపు కార్డుతో మండల కార్యాలయాలను సంప్రదించాలని కోరారు. ప్రతి మండలంలో ఓ బ్యాంకును నోడల్ బ్యాంకుగా గుర్తించామని, డెబిట్ కార్డులను ఎలా వినియోగించాలో ఖాతాదారులకు అర్థమయ్యేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని కలెక్టర్ వివరించారు. ఈనెల 20న అంబర్‌పేట, అమీర్‌పేట, హిమాయత్‌నగర్, ముషీరాబాద్, 21 సికింద్రాబాద్, నాంపల్లి, సైదాబాద్, షేక్‌పేటలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని, తిరుమలగిరి, ఆసిఫ్‌నగర్, చార్మినార్, ఖైరతాబాద్‌లలో 22న, బండ్లగూడ, గోల్కొండ, మారేడుపల్లి, బహదూర్‌పురా మండలాల్లో ఈనెల 23న అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని కలెక్టర్ వివరించారు.

  • Loading...

More Telugu News