: ప్రపంచ దేశాలకు ఓ మాయని మచ్చ ..సిరియా మారణహోమం: బాన్ కీ మూన్


ప్రపంచ దేశాలకు సిరియా మారణహోమం ఓ మాయని మచ్చ అని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ అన్నారు. ఈ నెల 31న ఆ పదవి నుంచి  వైదొలగనున్న బాన్ కీ మూన్ చివరి మీడియా సమావేశంలో మాట్లాడుతూ, అంతర్యుద్ధంతో రణరంగంగా మారిన సిరియాలోని అలెప్పో పట్టణం నరకానికి ప్రతీకగా మారిందని అభివర్ణించారు. దక్షిణ సూడాన్ లోని నేతలు శాంతి ఒప్పందాన్ని దుర్వినియోగపరచడం కారణంగానే ప్రస్తుత పరిస్థితులు తలెత్తాయని, అక్కడి నాయకులు తమ ప్రజలకు నమ్మకద్రోహం చేశారని ఆయన మండిపడ్డారు.

  • Loading...

More Telugu News