: ‘రా’, ‘ఐబీ’ లకు కొత్త చీఫ్ ల నియామకం
భారత్ కు చెందిన రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (రా), ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ)ల కొత్త చీఫ్ ల పేర్లను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ‘రా’కు అనిల్ దస్మానాను, ‘ఐబీ’కు రాజీవ్ జైన్ ను కొత్త చీఫ్ లుగా నియమిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం ‘రా’ చీఫ్ గా రాజేంద్ర ఖన్నా, ‘ఐబీ’ చీఫ్ గా దినేశ్వర్ శర్మ వ్యవహరిస్తున్నారు. ఆయా చీఫ్ లుగా దస్మానా, జైన్ లు త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్నారు.