: కేసీఆర్ ను పొగిడిన టీడీపీ ఎమ్మెల్యే కృష్ణయ్య
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య పొగడ్తల వర్షం కురిపించారు. శాసనసభలో విద్యుత్ అంశంపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో గతంలో కంటే మెరుగైన విద్యుత్ ను పొందుతున్నామని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ విషయంలో తీసుకున్న విధానాన్ని తాను అభినందిస్తున్నానని చెప్పారు. సోలార్ ప్యానల్స్ మీద రైతులకు సబ్సిడీ ఇవ్వాలని... సోలార్ విద్యుత్ పై రైతులకు అవగాహన కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. విద్యుత్ శాఖలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించడం తనకు ఆనందాన్ని కలిగిస్తోందని చెప్పారు.