: ప్రభుత్వ సలహాదారుగా బాధ్యతలు స్వీకరించిన మాజీ ఎంపీ వివేక్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా మాజీ ఎంపీ వివేక్ బాధ్యతలను స్వీకరించారు. సచివాలయంలోని డీ-బ్లాక్ లో మెదటి అంతస్తులో ఏర్పాటు చేసిన తన ఛాంబర్ లో వేదపండితుల పూజలు, ఆశీర్వచనాల అనంతరం... ఆయన తన సీట్ లో ఆసీనులయ్యారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డితో పాటు వివేక్ కుటుంబసభ్యులు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ, పొరుగు రాష్ట్రాలతో సమన్వయం చేసుకుని తెలంగాణ హక్కులను కాపాడడంలో కీలకపాత్ర పోషిస్తానని చెప్పారు. విద్యుత్, కృష్ణా, గోదావరి జలాల వాటాలను సాధించడానికి కృషి చేస్తానని తెలిపారు. తనకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని చెప్పారు.